telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బాయ్ ఫ్రెండ్ స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని… ఆ యువతీ ఏం చేసిందంటే…!?

Man-Get-Slapped

చైనాలో వాలెంటైన్స్ డే మే 20న జరుపుకుంటారు. అక్కడి వారు వాలెంటైన్స్ డే ను “520” అని కూడా పిలుచుకుంటారు. అంటే ఐదో నెల 20వ తేదీ అన్నమాట. ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజు సిచువాన్‌లోని ఓ జంటకు మాత్రం బాధతో ముగిసింది. వాలెంటైన్స్ రోజున తన బాయ్‌ఫ్రెండ్ స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇస్తాడని ఆశగా చూసిన గర్ల్‌ఫ్రెండ్‌కు నిరాశే మిగిలింది. దీంతో కోపగించిన యువతి రోడ్డుపై అందరూ చూస్తుండగానే బాయ్‌ఫ్రెండ్‌ను చెంపల మీద కొట్టడం మొదలుపెట్టింది. చాలా మంది ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. తాను తప్పు చేశానని, తన గర్ల్‌ఫ్రెండ్ కోపం పోయేదాకా కొట్టించుకుంటానని బాయ్‌ఫ్రెండ్ సమాధానమిచ్చాడు. ఇక చివరకు పోలీసులు అక్కడకు చేరుకుని యువతిని ఆపారు. అప్పటివరకు యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను 52 సార్లు చెంపలపై కొట్టినట్టు అక్కడున్న వారు చెప్పారు.

అక్కడున్న చాలా మంది జరిగిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. చైనా వ్యాప్తంగా ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. పోలీసులు యువతిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. తన గర్ల్‌ఫ్రెండ్ తనకు ఎంతో ఖర్చు చేస్తోందని, ఆమెకు ఫోన్ కూడా కొనివ్వలేకపోయానని చెప్పాడు. తన కోపం తగ్గడానికే కొట్టిందని, ఇందులో ఆమె తప్పు ఏం లేదని పోలీసులకు వివరించడంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

Related posts