telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక సామాజిక

ఐరన్ మాన్ లా 6000 అడుగుల ఎత్తుకు ఎగిరాడు… వీడియో వైరల్

Iron-Man

ఫ్రాన్స్‌కు చెందిన డేర్ డెవిల్.. వెనీస్ రెఫెట్ అనే వ్యక్తి ఇటీవల దుబాయ్‌లో గగనతలంలో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. జెట్ రెక్కల సాయంతో ఆకాశంలోకి దూసుకెళ్లాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ఎగరలేనంత ఎత్తుకు ఎగిరి అబ్బురపరిచాడు. సుమారు 1,800 మీటర్ల (6,000) ఎత్తుకు ఎగిరిన వెనీస్‌ సాహసాన్ని చూసి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. కార్బన్ ఫైర్ వింగ్స్ కలిగిన జెట్ ప్యాక్స్ సాయంతో వెనీస్ ఈ సాహసం చేయగలిగాడు. ఆ జెట్ ప్యాక్స్ ఏ మాత్రం విఫలమైనా అతడు అంత ఎత్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే, అవేవీ లెక్క చేయకుండా వినీస్ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం. ఈ సాహసానికి వాడిన వింగ్స్(రెక్కలు)లో మొత్తం నాలుగు మినీ జెట్ ఇంజిన్స్ ఉన్నాయి. వీటి ద్వారా గంటకు 400 కిమీలు ప్రయాణించవచ్చు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ‘ఎక్స్‌పో 2020 దుబాయ్’లో మరోసారి ఈ స్టంట్‌ను ప్రదర్శించనున్నాడు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts