telugu navyamedia
crime culture news trending

హనీమూన్ ఆ జంటకు కాళరాత్రిగా మిగిలింది

Man drowns in Florida while swimming in ocean for first time

ఫ్లోరిడాకు వెళ్లిన ఓ కొత్త జంటకు ఎదురైన చేదు అనుభవం ఇది. బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో భర్త నీట మునిగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… డాల్టన్ కాట్రెల్ (22) అనే యువకుడికి చెయేన్నె హెడ్రిక్ (22) అనే యువతితో గత శనివారం మిస్సోరిలోని కాన్సస్‌లో వివాహమైంది. దాంతో ఈ కొత్త జంట హనీమూన్ కోసం సెయింట్ ఆగస్టైన్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం డాల్టన్, చెయేన్నె స్థానికంగా ఉండే క్రిసెంట్ బీచ్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు సరదాగా గడిపిన ఈ జంట ఈత కోసం బీచ్‌లో దిగారు. అయితే, డాల్టన్ కొంచెం లోతుగా ఉన్న ప్రదేశంలో ఈత కొడుతున్న సమయంలో పెద్ద అల వచ్చింది. దాంతో డాల్టన్ సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. వెంటనే చెయేన్నె అక్కడే ఉన్న పోలీసులతో తన భర్త కొట్టుకుపోయిన విషయాన్ని చెప్పింది. దీంతో పోలీసులు డాల్టన్ కోసం గజ ఈత గాళ్ల సహాయంతో గాలించారు. కొద్దిసేపటి తరువాత డాల్టన్ బాడీ దొరికింది. వెంటనే అతడ్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పెళ్లైన మూడు రోజులకే భర్త చనిపోవడంతో చెయేన్నె రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. ఈ ఘటనను తన ఫేస్‌బుక్ పేజీలో వివరిస్తూ కన్నీటి పర్యంతమైందామె. తామిద్దరం పాస్టర్స్ అయ్యేందుకు లోవాలోని ఫెయిత్ బాపిస్ట్ బైబిల్ కాలేజీలో చదువుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక పెళ్లైన మూడు రోజులకే డాల్టన్ తనను వదిలివెళ్లిపోవడం ఓ పీడకలలా ఉందని ఆమె వాపోయింది.

Related posts

కాలుష్యం నేపథ్యంలో .. ఢిల్లీలో కార్యాలయాల పనివేళల్లో మార్పులు..

vimala p

చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తున్నారు: రోజా

vimala p

క్లబ్ డ్యాన్సర్ గా రకుల్… సెక్సీ వీడియో సాంగ్

vimala p