telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం… తరువాత ముక్కలుగా…

Man dismembered Girlfriends Teen Daughter

14 ఏళ్ల అమ్మాయిని బలాత్కరించి, పీక పిసికి చంపేసిన కేసులో నిందితుడైన 46 ఏళ్ల జాకబ్ సులివన్‌కు మరణశిక్ష విధించాలని పెన్సిల్వేనియా కోర్టు నిర్ణయించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన మృతురాలి తల్లి సారా ప్యాకర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే…

2007లో అనాధల దత్తతల విషయాలు చూసే అధికారిణిగా పని చేస్తున్న సారా, ఆమె అప్పటి భర్త డేవిడ్ కలిసి ఎందరో అనాధలను దత్తత తీసుకున్నారు. వారిలో గ్రేస్ అనే అమ్మాయి కూడా ఉంది. బయటకు చాలా మంచి వారిగా కనిపించే ఆ దంపతులు.. దత్తత తీసుకున్న అమ్మాయిలపై లైంగిక దాడులు చేసేవారు. గ్రేస్‌ విషయంలో కూడా డేవిడ్ అలానే ప్రవర్తించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సారాను కూడా ఉద్యోగంలో నుంచి తొలగించారు. అలాగే ఆమె మరెవరినీ దత్తత తీసుకోవడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్రేస్‌పై కక్ష పెంచుకున్న సారాకు.. 2013లో జాకబ్ పరిచయం అయ్యాడు. అతనితో సహజీవనం ప్రారంభించిన సారా.. ఓ పథకం ప్రకారం అతను గ్రేస్‌ను లైంగికంగా వేధించేలా చేసింది.

2016లో ఓ రోజు వీరిద్దరూ కలిసి బలవంతంగా గ్రేస్‌ను ఇంటి బేస్‌మెంటుకు తీసుకెళ్లి ఆమె చేతులు కాళ్లు కట్టేసి.. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించారు. అనంతరం జాకబ్ ఆ అమ్మాయిని బలాత్కరించాడు. ఆ తర్వాత గ్రేస్‌కు అధికమొత్తంలో మత్తు మందు ఇచ్చిన వాళ్లు.. ఆమెను అక్కడే కట్టేసి బయటకు వెళ్లిపోయారు. ఎంతో కష్టపడి తన కట్లు విప్పుకున్న గ్రేస్.. అక్కడినుంచి తప్పించుకోలేకపోయింది. మరుసటి రోజు ఇంటికి వచ్చిన సారా, జాకబ్ ఈ విషయాన్ని గమనించారు. గ్రేస్ ఇంకా బతికే ఉండటం చూసిన జాకబ్ వెంటనే ఆమె పీక పిసికి చంపేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కొన్ని నెలలపాటు ఆ ఇంటి బేస్‌మెంటులోనే దాచి ఉంచిన ఆ జంట.. ఆ తర్వాత దాన్ని ఊరి చివరకు తీసుకెళ్లి పారేశారు.

కూతురు కనిపించకుండా పోయినట్లు కేసు పెట్టిన సారా.. ఆ విషయంలో పెద్దగా ఆందోళన చెందకపోవడంతో అనుమానించిన అధికారులకు ఈ మృతదేహం లభించింది. దీనిపై విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కోర్టులో తన నేరం అంగీకరించిన సారా.. క్షమాభిక్ష కోరడంతో మరణశిక్ష వేయాలని భావించిన ధర్మాసనం ఆమెకు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అయితే జాకబ్ విషయంలో ఎటువంటి జాలి చూపించే అవకాశం లేదని, ఓ బాలికను ఎంతలా హింసించాలో అంతలా హింసించిన అతనికి మరణశిక్ష వేయడమే సరైందని కోర్టు తీర్పు ఇచ్చింది.

Related posts