telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్ద గోల్కొండ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకున్నది. శంషాబాద్ నుంచి తుక్కుగుడ వైపు వస్తున్న కారులో పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌ నెంబరు 17 వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో క్షణాల్లోనే మంటలు ఎగిసిపడి కారు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న వ్యక్తి మంటల్లోనే చిక్కుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు. మంట‌ల్లో దగ్ధమైన కారు నెంబరు హోండా అమేజ్‌ కారుఏపీ 27 సీ 0206గా గుర్తించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts