telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

‘వకీల్ సాబ్’ సినిమా చూస్తూ ఏపీ యువకుడు మృతి !

పవన్ కళ్యాణ్ లాయర్ గా నటించిన చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ సినిమా మంచి కలెక్షన్ లతో దుమ్మురేపుతోంది. తెలుగు స్టేట్స్ ఏ కాకుండా మిగతా చోట్ల మంచి విజయం సాధించింది వకీల్ సాబ్. అయితే తాజాగా వకీల్ సాబ్ సినిమా చూస్తూ ఓ యువకుడు గుండె పోటుతో మరణించాడు. తెనాలిలోని లక్ష్మీ డీలక్స్ హాల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీస్ లకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత్తిడికి సంబంధించిన వివరాలను ఆరతీస్తున్నారు. కాగా ఈ మూవీ విడుదల రోజు నుంచి ఏపీలో అనేక అడ్డంకులు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా..వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్దానికి కూడా దారి తీసింది.

Related posts