telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పీవోకే దాటేసిన పౌరుడు..తిరిగి పంపేసిన భారత సైన్యం.. మానవతా దృక్పథంతో ..

man crossed pok sent back by indian army

ఓ వ్యక్తి పొరపాటున పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సరిహద్దు దాటి వచ్చేశాడు, భారత సైన్యం మానవతా దృక్పథంతో అతడిని వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీవోకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు. పీవోకే తంగ్దర్‌ సెక్టార్‌లోని స్థానికుల సాయంతో 2019 మే 17న షబీర్‌ అహ్మద్‌ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత భారత సైనికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ వ్యక్తిని తిరిగి అప్పగించాలంటూ పీవోకే అధికారులు ఇటీవల భారత సైన్యాన్ని సంప్రదించారు.

భారత సైన్యం మానవతా దృక్పథంతో ఆలోచించి తంగ్దర్‌ సెక్టార్‌లోని తిత్వాల్‌ క్రాసింగ్‌ వద్ద అతడిని పాక్‌ అధికారులకు అప్పగించింది. ఇటీవల భారత్‌కు చెందిన ఇద్దరు పౌరులు అనుకోకుండా సరిహద్దులు దాటడంతో పాక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారికి కాన్సులర్‌ యాక్సెస్‌ కల్పించి, ఎలాంటి హానీ లేకుండా తిరిగి పంపాలంటూ భారత విదేశాంగ శాఖ ఆ దేశానికి విజ్ఞప్తి చేసింది. అసలు అది పీవోకే కాదు, కాశ్మీర్ హద్దులు ఎప్పుడో కేంద్రం మార్చేసి, దానిని లడక్ లో కలిపేసింది. దానిని పాక్ ఆక్రమిత లడక్ అనాలేమో!

Related posts