telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

అదిలాబాద్ లో దారుణం.. మహిళను నమ్మించి మోసం చేసిన ఉద్యోగి..

rape

తెలంగాణలో ఈ మధ్య మహిళల పై వరుస దాడులు జరుగుతున్నాయి.. పోలీసులు ఎక్కడిక్కడ కఠిన శిక్షలు అమలు చేస్తున్న కూడా కామాంధుల తీరులో మాత్రం మార్పు లేదు.. తెలంగాణలో నలుమూలల్లో ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఈ అమానుష ఘటన తెలంగాణ అదిలాబాద్ లో చోటు చేసుకుంది.. ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ హైదరాబాద్లో జాబ్ చేస్తున్న భర్త, అక్కడే ఉంటున్న పిల్లలతో కలసి ఉండాలని భావించి బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా మామిడిపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చంద్రశేఖర్ పరిచయమ్యాడు. మొదట డబ్బులు తీసుకున్న అతను హైదరాబాద్ కు వెళ్దామని నమ్మించాడు. అలా ఇంటికి వెళ్ళగానే అతని కర్కశ బుద్దిని బయట పెట్టాడు. మహిళ పై దారుణంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అందుకు సంబంధించిన వీడియో లు ఉన్నాయని అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 10 లక్షల నగదు, 35 తులాల బంగారాన్ని తీసుకున్నాడు అయిన అతని తీరులో మార్పు రాలేదు.. ఇంకా కావాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక మహిళల పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts