telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

నటుడు విశాల్ పేరుతో .. 47 లక్షల మేర భారీ మోసం..

man cheating producer with visal name

నరేశ్ బోద్రా అనే వ్యాపారి తమిళ నటుడు విశాల్ ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పిన దర్శకుడు వడివుడైయాన్‌, తనను మోసం చేశారని పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు, సినిమా తీయాలన్న కోరికతో ఉన్న బోద్రాను కలిసిన వడివుడైయాన్‌, తన వద్ద విశాల్‌ కాల్‌ షీట్స్‌ ఉన్నాయని చెప్పి, అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపించాడు.

సినిమా విశాల్ తో అనగానే నరేశ్ బోద్రా సైతం సంతోషించి, రూ. 47 లక్షలను దర్శకుడికి ఇచ్చారు. ఆపై సినిమా ప్రారంభం కాకపోవడంతో అనుమానం వచ్చి, ఒప్పంద పత్రాలను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో తానిచ్చిన డబ్బును ఇవ్వాలని అడుగుతుంటే, ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేశ్ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వడివుడైయాన్‌ ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, నరేశ్‌బోద్రా ఎవరో తనకు తెలియదని వడివుడైయాన్ అంటుండటం గమనార్హం.

Related posts