telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళా రిపోర్టర్ ను లైవ్ లో ముద్దు పెట్టుకున్న ఆకతాయి… ఆమె ఏం చేసిందంటే ?

Reporter

అమెరికాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. లైవ్‌లో వార్త రిపోర్ట్ చేస్తున్న మహిళా రిపోర్టర్‌ను ఓ ఆకతాయి ఉన్నట్టుండి ముద్దుపెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. వేవ్ 3 న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న సారా రివస్ట్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. కెంటుకీ ఫెస్టివల్‌ను కవర్ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సారా ఓ కార్యక్రమాన్ని లైవ్‌లో వివరిస్తోంది. అదే సమయంలో ఆమె చుట్టు పక్కల ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అప్పటికీ ఆమె అతడిని ఓ కంట కనిపెడుతూనే ఉంది. లైవ్ ప్రోగ్రామ్ కావడంతో ఆమె కెమెరా వైపు చూస్తూ రిపోర్టింగ్ చేయసాగింది. అదే అదనుగా భావించిన ఆకతాయి ఆమె బుగ్గ మీద ముద్దాడి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ దృశ్యాలు కాస్తా కెమెరాలో రికార్డయ్యాయి. ఈ హఠాత్పరిణామంతో షాకైన సారా వార్త చెప్పడం కంప్లీట్ అయిన తరువాత సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా సారాను ముద్దాడిని వ్యక్తిని ఎరిక్ గూడ్‌మ్యాన్‌గా గుర్తించిన పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related posts