telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లితో డేటింగ్… కానీ ఆమె రెండేళ్ల కూతురితో…!

Arrest

అమెరికాలోని న్యూజెర్సీలో దారుణం చోటు చేసుకుంది. మైసన్ ఆండ్రెస్ టోరెస్ అనే వ్యక్తి తన ఇంటి దగ్గరలోనే ఉండే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు అప్పటికే రెండేళ్ల కుమార్తె ఉందని తెలిసినా వెనకడుగు వేయలేదు. అది చూసి టోరెస్ చాలా మంచివాడని భావించి, అతనితో డేటింగ్ చేయడానికి ఒప్పుకుంది. అతని ప్రవర్తన నచ్చడంతో వివాహం కూడా చేసుకుందామని అనుకుంది. ఇంతలో ఊహించని షాక్ తగిలింది ఆమెకు. పాపను ఎవరో అత్యంత క్రూరంగా హింసించి చంపేశారని తెలిపారు. ఆ తర్వాత పోలీసు దర్యాప్తులో ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. ఇంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్న టోరెస్.. ఆమె లేని సమయంలో పశువులా మారేవాడని, రెండేళ్ల ఆమె కూతుర్ని చిత్రహింసలకు గురిచేసేవాడని పోలీసులు చెప్పారు. పాప శరీరంపై సలసలమరిగే నీళ్లు కుమ్మరించేవాడని, అభం శుభం తెలియని చిట్టిపాపపై పిడిగుద్దుల వర్షం కురిపించేవాడని తెలిపారు. చివరకు ఒకరోజు అతని పశుత్వం పరాకాష్టకు చేరడంతో ఆ పాప గొంతుపిసికి చంపేశాడని తేల్చారు. ఈ విషయం తెలిసిన ఆ తల్లి గుండె బద్దలైంది.

Related posts