telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

జంతువులను కూడా వదలటంలేదా.. వాటికీ పోక్సో చట్టం రావాల్సిందేనా.. !!

man abused dog caught cc cam

ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగటం లేదు. ఒక నేరంపై చట్టాన్ని రూపొందిస్తే, వెంటనే దానిలో లూప్ హోల్స్ పట్టుకొని దానికి తగ్గట్టుగా నేరాలు చేయడం అలవాటు చేసుకుంటున్నారు ఈ ఘనులు. తాజాగా, ఓ టీస్టాల్ లో పని చేస్తున్న కార్మికుడు, వీధి కుక్కపై అత్యాచారం చేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన చెన్నైలో జరిగింది. జంతు సంరక్షణ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, కుక్కపై అత్యాచారం జరిగిన విషయం వాస్తవమేనని తేల్చి అవాక్కై, కేసు నమోదు చేశారు.

రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని, బలవంతంగా శునకాన్ని తీసుకుని యువకుడు వెళుతుండగా, స్థానికుడు చూశాడని, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడని, ఆపై దానిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related posts