telugu navyamedia
సినిమా వార్తలు

అభిమానుల కారణంగా సారీ చెప్పిన సూపర్ స్టార్

Mammootty

సాధారణంగా సినీ సెలెబ్రెటీలకు అభిమానులు ఉండడం అనేది సాధారణ విషయమే. అయితే కొన్నిసార్లు వాళ్ళ వల్ల తలనొప్పుకు కూడా వస్తుంటాయి సెలెబ్రెటీలకు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తన అభిమానులు చేసిన పనికి సారీ చెప్పాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మమ్ముట్టి గత ఏడాది ‘పేరన్బు’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి నటనకు జాతీయ అవార్డు ఎందుకు ఇవ్వలేదు? అని ఆయన అభిమానులు కోపం తెచ్చుకున్నారు. దాంతో వారు ఏకంగా నేషనల్ అవార్డ్ కమిటీ చైర్మన్ రాహుల్ రావిల్‌ను సోషల్ మీడియా వేదికగా చేసుకుని విమర్శించారు. దీంతో నేషనల్ అవార్డ్ కమిటీ చైర్మన్ రాహుల్ రావిల్ ట్విట్టర్ వేదికగా మమ్ముట్టికి అసలు విషయాన్ని తెలియజేశారు. నేషనల్ అవార్డ్ కమిటీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించరాదని, అదీగాక ‘పేరన్బు’ చిత్రాన్ని రీజనల్ కమిటీయే తిరస్కరించడంతో అది నేషనల్ అవార్డ్ కమిటీ పోటీలోకే రాలేదని ఆయన మమ్ముట్టికీ తెలియజేశారు. దీనిపై స్పందించిన మమ్ముట్టి. “సారీ సర్.. నాకు ఆ విషయం తెలియదు. అయినా కూడా జరిగిన పరిణామాలకు నేను క్షమాపణలు చెబుతున్నాను” అంటూ రిప్లయ్ ఇచ్చారు మమ్ముట్టి.

Related posts