telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది: మమతా బెనర్జీ

mamatha benerji

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పరిణామాల పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని ఆమెఅన్నారు. కశ్మీర్ పై కశ్మీర్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భద్రత పేరుతో పోలీసులు తీవ్ర ఆంక్షలను విధించారని పేర్కొన్నారు. దీంతో అక్కడ మానవ హక్కులు మంటగలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరైన చర్య కాదన్నారు.

Related posts