telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డబుల్ బెడ్రూం ఇళ్లకు అతీగతీ లేదు: భట్టి విక్రమార్క

Batti vikramarka

ఆరేళ్లు గడిచినా డబుల్ బెడ్రూం ఇళ్లకు అతీగతీ లేదని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. .అసెంబ్లీ కమిటీ హాలులో నిన్న జరిగిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ దళితులు, గిరిజనుల కుటుంబాలందరికీ మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆరువేల మందికి మాత్రమే పంచారని పేర్కొన్నారు.

దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి దొరకని పక్షంలో భూమికి నిర్ణయించిన రూ. 22 లక్షలను డిపాజిట్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చేసి దానిపై వచ్చే ఆదాయాన్ని ఆయా లబ్ధిదారుల కుటుంబాలకు చెందేలా చేయాలని అన్నారు. ప్రైవేటు వర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. అలాగే, ఎస్టీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాంకేతిక కళాశాలలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజనులతో భర్తీ చేయాలని కోరారు.

Related posts