telugu navyamedia
సినిమా వార్తలు

శృంగార తార నడుముపై దర్శకుడు అసభ్యంగా…

Mallika-Sherawath

బాలీవుడ్ లో శృంగార తారగా వెలుగొందిన నటి మల్లికా శరావత్. తన అందాల ఆరబోతతో ఎందరో కుర్రాళ్లకు మతులు పోగొట్టి, సినిమాలకు కాసుల వర్షం కురిపించిన మల్లికా శరావత్ కు ఇటీవల సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మల్లికా నటిస్తున్న చిత్రం “బూ..సబ్కి ఫేటేగి”. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఇటీవల మల్లికా శరావత్ కపిల్ శర్మ షోలో పాల్గొంది. ఈ షోలో మల్లికా శరావత్ అందాల ఘాటుని వర్ణిస్తూ కపిల్ శర్మ “గతంలో చపాతీలు వేడిగా ఉండడం కోసం ఓ హీరోయిన్ పోస్టర్స్ తో చుట్టేవారట నిజమేనా ?” అంటూ ప్రశ్నించగా… మల్లికా నవ్వుతూ “నాకు తెలియదు” అని సమాధానం ఇచ్చింది. “మీరు చెప్పింది చాలా సరదా విషయం. కానీ కొంతమంది నా అందాన్ని వికృతంగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఓ సన్నివేశంలో భాగంగా నా నడుము, బొడ్డుని హైలైట్ చేయాలని దర్శకుడు, నిర్మాత భావించారు. ఆ విషయం నాతో చెప్పగా ఓకే అన్నాను. కానీ సెట్స్ కు వెళ్లిన తర్వాత నా నడుముపై కోడిగుడ్డు పెట్టి వికృతంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అలాంటి సన్నివేశాలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాను. నాపై జరిగిన నెగిటివ్ ప్రచారం కారణంగా దాదాపు 30 చిత్రాల్లో అవకాశాలు కోల్పోయాను. మల్లికా కోపిష్టి అంటూ కొంతమంది చేసిన ప్రచారం వల్ల చాలా మంది హీరోలు నన్ను తప్పించి ఆ స్థానంలో తమ ప్రియురాళ్లని తీసుకునేవారు” అంటూ తనకు బాలీవుడ్ లో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది మల్లికా శరావత్.

Related posts