telugu navyamedia
సినిమా వార్తలు

మల్లె మరవం లాంటి ప్రేమ..

adabatu poetry corner

ప్రేమ జీవితంలో విరబూయాలి
మల్లె మరువం అల్లికల్లోని అందం
ఒద్దికైన ప్రేమ ప్రయాణం విచ్చికోవాలి
మల్లె మరువం పరిమళాల వేదజల్లులు
చిన్నచూపు లేని బంధం నూరేళ్ళు పంట
మల్లె ఆకర్షణకు మరువం జీవంపోస్తున్నట్టు
నాటి ప్రేమానురాగాలు నేటితరానికి నాంది
మల్లె మరువం స్వచ్ఛత ఆరోజులను గుర్తుచేస్తూ
కలిసుంటే ఎండమావిలో అయినా సంతోషమని
ఎండపోయిన మల్లె మరువం చిగురిస్తూ చెప్పెను
పెంచుకునే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది ప్రేమ
మల్లె మరువం సోయగాలు సొంతం చేసినట్టుగా
సంతోషాలతో ఇరువురు అంటాలి అంబరాన్ని 
నక్షత్రల్లా మెరిసి మురిపించే మల్లె మరువంలా
శతమానంభవతి అని దీవించెరు అందరూ
మీ ఇరువురిపై మల్లెమరువం అక్షింతలుగా
వయస్సు మీద పడినా బంధం బలపడాలి
వాడిపోతూ మల్లె మరువం చెప్పిన సత్యం

-శివేగారి చిన్నికృష్ణ, పలమనేరు

Related posts