telugu navyamedia
సినిమా వార్తలు

జ్యోతిక సినిమాపై మలేషియా విద్యాశాఖ మంత్రి ప్రశంసలు

Jyothika

పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైన “36 వయోదినిలే” చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవ‌ల జ్యోతిక “రాట్చాసి” అనే సినిమాలో పాఠ‌శాల ప్రిన్సిప‌ల్ ఆఫీస‌ర్ పాత్ర చేసింది. గౌత‌మ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో భారతదేశంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు. ఈ చిత్రాన్ని ఇటీవలే మ‌లేషియా విద్యాశాఖ మంత్రి మాస్లీ మాలిక్ వీక్షించారు. సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాలని అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులను తీసుకురావడానికి దర్శకుడు ప్రదర్శించిన అనేక అంశాలను ఆయన చ‌ర్చించారు. జ్యోతిక త‌న మ‌రిది కార్తీతో క‌లిసి ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌త్య‌రాజ్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, జ్యోతిక‌తో “పాప‌నాశం” తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆన్స‌న్ పాల్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. గోవింద్ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, స‌రికొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో కార్తీ, జ్యోతిక సోదరుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని టాక్. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. “పొన్‌మగల్‌ వందాల్‌” అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న చిత్రంలోను జ్యోతిక న‌టించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. సీనియర్‌ దర్శక నటులు భాగ్యరాజ్, పాండియరాజన్, పార్తిబన్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తుండటం విశేషం. ప్రతాప్‌ పోతన్‌ కీలకపాత్రలో కనిపిస్తారు. జేజే ప్రట్రిక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సందేశాత్మ‌క చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చుతున్నారు.

Related posts