telugu navyamedia
సినిమా వార్తలు

కమల్ నన్ను లైంగికంగా వేధించాడు : వర్ధమాన నటి

Kamal-Hassan

కమల్ తనను లైంగికంగా వేధించాడని మాలీవుడ్ వర్ధమాన నటి ఒకరు ఆరోపించినట్టు శనివారం ఒక మలయాళం టీవీ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ మేరకు కమల్‌కు నోటీస్ కూడా పంపిందని పేర్కొంది. ఆయన దర్శకత్వం వహించిన ‘ఆమి’ సినిమా షూటింగ్ సమయంలో కూడా నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఆయన నన్ను ఫ్లాట్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయనపై నాకున్న నమ్మకాన్ని కమల్ పోగొట్టుకున్నాడు. మేకతోలు ధరించిన తోడేలు అతను. ఆయన సొంత ఇంట్లో కూడా నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు అని నోటీసులో నటి ఆరోపించినట్టు ఛానెల్ కథనంలో పేర్కొంది. మంజూ వారియర్ ప్రధాన పాత్రలో 2018లో ‘ఆమి’ సినిమా వచ్చింది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలను దర్శకుడు కమల్ ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపడేశారు. ఏడాది క్రితం తనకు లీగల్ నోటీసు వచ్చిన మాట నిజమేనని అన్నారు. దానిపై తన అడ్వకేట్‌ను సంప్రదించగా, ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయన చెప్పారని.. దీంతో నోటీసు పంపినవారి నుంచి తదుపరి చర్యల కోసం వేచి చూడాల్సి వచ్చిందన్నారు. వారు తరవాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను దాన్ని పక్కన పెట్టేశానని స్పష్టం చేశారు. కుట్రపూరితంగానే తనపై ఈ ఆరోపణలు చేశారని కమల్ అన్నారు.

Related posts