telugu navyamedia
telugu cinema news

అల్లు అర్జున్ కు తండ్రిగా మలయాళ నటుడు

Jayaram

నా పేరు సూర్య”తో భారీ డిజాస్టర్ ను చూసిన అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇటీవల త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్ ను అందుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, టబు, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 ఈ సినిమాకి అంతకుముందు “నాన్న నేను” అనే టైటిల్ విన్పించింది. కానీ ఇప్పుడు మాత్రం “అలకనంద” అనే టైటిల్ దాదాపుగా ఖాయమైందని సమాచారం. ఈ చిత్రంలో తండ్రి పాత్ర కూడా చాలా ప్రాధాన్యత ఉండడంతో ఈ పాత్ర కోసం సీనియర్ హీరోల పేర్లను పరిశీలించి, మలయాళ నటుడు జయరామ్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో జయరామ్ కి మంచి క్రేజ్ వుంది. నటుడిగా సుదీర్ఘకాల ప్రయాణంలో ఆయన చేస్తోన్న తెలుగు సినిమా ఇదే. ఇక బన్నీకి కూడా మలయాళంలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

Related posts

ఆవు దూడకు పాలిస్తున్న… శునకం…

vimala p

నేటితరం ప్రేమకథాచిత్రం  ‘4 లెట‌ర్స్‌’…

vimala p

హైదరాబాద్ కి వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన ఉండవల్లి

vimala p