telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పెళ్లి సందడిలో హీరోయిన్ ఎవరంటే…?

రాఘవేంద్రరావు కమర్షియల్‌ మూవీస్‌ని పక్కనపెట్టి పదేళ్లు అవుతోంది. 2010లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ తర్వాత మళ్లీ కమర్షియల్‌ మూవీస్‌ తియ్యలేదు రాఘవేంద్రరావు. ‘శిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ’ లాంటి భక్తి సినిమాలే చేశాడు. అయితే మళ్లీ ఇప్పుడీ దర్శకుడు తన మార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతోందని మొన్నామధ్య  ఒక వీడియో రిలీజ్‌ చేశారు . ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయ్యిందని, మ్యూజిక్ సెషన్స్‌ కూడా మొదలయ్యాయని తెలిపారు.ఈ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రొనన్కి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ కొత్త ‘పెళ్లి సందడి’లో హీరో ఎవరు అనేదానికి ఇంట్రెస్టింగ్‌ గా మారింది నిన్నటివరకు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తన హీరో రోషన్ అంటూ అనౌన్స్ చేసారు దర్శకేంద్రుడు.

ఇప్పుడు హీరోయిన్ పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం పెళ్లి సందడిలో రోషన్ కు జోడీగా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేశారట చిత్రయూనిట్. అయితే కొంతమంది అమ్మాయిలను కూడా పరిశీలించారు. చివరకు మాళవిక నాయర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం , ఇటీవల వచ్చిన ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మాళవిక నాయర్మంచి పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు అయితే రోషన్ పక్కన సరిగ్గా సూటవుతుందని ఫిక్స్ అయ్యారట దర్శకుడు.

Related posts