telugu navyamedia
సినిమా వార్తలు

మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం

malaika-arora-khan

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి మలైకా ఓ షోలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 15 సంవత్సరాలు అర్భాజ్ ఖాన్ తో వైవాహిక బంధాన్ని సాగించిన మలైకా 2017లో ఆయనతో విడాకులు తీసుకున్నారు. సదరు షో సందర్భంగా తన పెళ్ళి, విడాకుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది మలైకా. “సాధారణంగా జీవితంలో తీసుకునే అన్ని నిర్ణయాల్లాగే… విడాకులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం కష్టం. కానీ నేను అర్భాజ్ అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. మా మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. ఒకరినొకరం చాలా వరకు బాధ పెట్టుకున్నాం. దీంతో మా చుట్టూ ఉన్నవారు కూడా మాతోపాటు బాధపడ్డారు. అందుకే విడిపోయి దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నాము” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

Related posts