telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మలైకా యోగాసనం… అర్జున్ కపూర్ ఏమన్నాడంటే…?

Malaika

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా మధ్య ప్రేమాయణం గురించి వారిద్దరే ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌‌లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మలైకా కంటే అర్జున్ కపూర్ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగగా… మలైకా ఘాటుగా స్పందించింది. ఇప్పుడు త‌మ బంధాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ఫిక్సైపోయారు ఈ జోడీ. ముంబైలోని కొత్త ఇంట్లో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. మలైకా అరోరా ఫిట్‌నెస్ కోసం రోజూ గంటల తరబడి జిమ్‌లో కసరత్తలు చేస్తుంటారు. వీకెండ్స్‌లో కాస్త ఎక్కువ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం కేటాయిస్తుంటారు. ఫిట్‌నెస్ విషయంలో తన అభిమానుల్లోనూ ఆసక్తి పెంచేందుకు ప్రయత్నిస్తుంటుంది మలైకా. ప్రతి వీకెండ్‌లో తన వ్యాయామానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా తన ఫేవరేట్ యోగాసనాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది 43 ఏళ్ల మలైకా. ఈ ఫోటోలో మలైకా అరోరా భుజంగాసనం వేశారు. ఈ యోగాసన ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా మలైకా వివరించింది. ఒత్తిడిని జయించేందుకు ఈ ఆసనం ఎంతగానే ఉపకరిస్తుందని వెల్లడించింది. మలైకా షేర్ చేసిన ఫోటోను ఆమె భాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ లైక్ చేయడం విశేషం.

 

View this post on Instagram

 

Good morning to all you lovely people! When the going gets tough, the tough get going. Wellness is a journey that lasts a lifetime. And it’s never about the destination, it’s about the journey itself. Here’s one of my favorite asanas, Bhujangasana. This Cobra pose forms a beautiful arch with your spine. Some of its benefits are: 1. It relieves stress. 2. It strengthens and tones your shoulders, abdomen and glutes. 3. It improves the flexibility of your body by working on the spinal column. 4. It calms your mind. Start your week on a positive note with the beautiful Bhujangasana, hold the posture for 5 to 10 breaths. Let go of everything that doesn’t serve your purpose in becoming your true self. Hello new week! Hello Universe. @sarvesh_shashi @sarvayogastudios @thedivayoga #Believeinyourself #BeYou #HappyMonday #malaikasmondaymotivation

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Related posts