telugu navyamedia
సినిమా వార్తలు

తాగిన మత్తులో హీరోయిన్ రచ్చ… సోనమ్ కపూర్ కు అవమానం

Arjun-kapoor-and-Malaikaarora-sonam-kapoor

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన భర్తకు విడాకులిచ్చి నటుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారనే టాక్ కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఈవెంట్స్ కు వెళ్లడం, పార్టీలకు వెళ్లడంతో ఎప్పుడూ బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారట. ఆ పార్టీకి అర్జున్ కపూర్ కజిన్ సోనమ్ కపూర్ కూడా హాజరయ్యారు. అక్కడ మలైకా వల్ల సోనమ్ కపూర్ అవమానపడినట్లు తెలుస్తోంది. పార్టీలో భాగంగా మలైకా కాస్త ఎక్కువగా మద్యాన్ని సేవించిందట. ఎక్కువగా మందు తాగడమే కాకుండా రచ్చ చేయడం మొదలుపెట్టేసిందట. తాగేసి అలా రచ్చ చేస్తున్న మలైకను అర్జున్ నిలువరించలేదట. అయితే సోనమ్ కపూర్ ఆమె దగ్గరకు వెళ్లి తనకు సాయం చేస్తానని ఆఫర్ చేయగా… మలైకా “స్టే అవే…” అని అరిచేసిందట. దీంతో సోనమ్ కపూర్ షాక్ అవ్వడమే కాకుండా అక్కడున్న వారంతా తననే చూడడంతో అవమానంగా ఫీల్ అయ్యిందట. ఇప్పటి వరకు మలైకా, అర్జున కపూర్ ల ప్రేమను సపోర్ట్ చేస్తున్న వారిలో సోనమ్ కపూర్ కూడా ఉంది. ఈ సంఘటనతో సోనమ్ కపూర్ వీరికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Related posts