telugu navyamedia
సినిమా వార్తలు

వాళ్ళు కచ్చితంగా వేరే జాతి వాళ్ళే… మలైకా ఘాటు వ్యాఖ్యలు

Arjun-Kapoor

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా మధ్య ప్రేమాయణం గురించి వారిద్దరే ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌‌లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మలైకా కంటే అర్జున్ కపూర్ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగగా… మలైకా ఘాటుగా స్పందించింది. ఇక అర్జున్ కపూర్ ను మలైకా వివాహం చేసుకోబోతోందని బాలీవుడ్ మీడియాలో ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వారి ప్రేమను అర్జున్, మలైకా బహిరంగంగా ప్రకటించడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై తాజాగా మలైకా స్పందించింది. అర్జున్‌తో వివాహం గురించి, తనపై వస్తున్న విమర్శల గురించి మలైకా మాట్లాడింది. “అర్జున్ కపూర్‌తో ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. అర్జున్‌ను వివాహం చేసుకోవాలనే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. ఈ బంధం ఇలాగే కొనసాగితే మంచిది. అర్జున్‌తో డేటింగ్ గురించి నన్ను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అయితే అవి నన్ను ఎప్పుడూ బాధించలేవు. నా చుట్టూ నేను ఓ రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాను. ట్రోల్స్‌ను సృష్టించేవారు కచ్చితంగా వేరే జాతికి చెందినవారై ఉంటారు” అంటోంది మలైకా.

Related posts