telugu navyamedia
telugu cinema news trending

“మహర్షి” మేకింగ్ వీడియో

maharshi

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన “మ‌హ‌ర్షి” చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నసంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో పెద్దగా సినిమాలు లేక‌పోవ‌డంతో ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌డుతుంద‌ని అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో గ్రామాన్ని నిర్మించ‌డంతో పాటు యాక్ష‌న్, త‌దిత‌ర స‌న్నివేశాల మేకింగ్స్ చూపించారు. ఈ వీడియో అభిమానుల‌ని ఆకట్టుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్ర సక్సెస్ మీట్ వేడుక‌ల‌లో పాల్గొన్న మ‌హేష్ త‌న ఫ్యామిలీతో కలిసి విహార యాత్ర‌కి వెళ్ళాడు. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా మొదలుపెట్టనున్నారు. మీరు కూడా ఈ మేకింగ్ వీడియోను వీక్షించండి.

Related posts

బాలయ్య 105వ చిత్రం థాయ్‌లాండ్‌ షెడ్యూల్ పూర్తి

vimala p

బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా బ్రేకప్ ?

vimala p

అక్కడ అత్యాచారాలు .. యథేచ్ఛగా చేసుకోవచ్చట.. !

vimala p