telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మజిలీ.. టీజర్..

majili movie on april 5th

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు సచినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం అని రావు రమేష్ చెప్పే డైలాగ్ అభిమానులని ఆకట్టుకుంది. చిత్రంలో పలు సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

మజిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ. వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నాగచైతన్య, సమంత పాత్రలు, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్‌ కు మంచి స్పందన లభిస్తుంది.

Related posts