telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో : “మజిలీ” డిలేటెడ్ సీన్-1

Majili

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కోలీవుడ్ మీడియా ప్ర‌కారం మ‌జిలీ చిత్ర రీమేక్ రైట్స్ స్టార్ హీరో ధనుష్ ద‌క్కించుకున్నాడ‌ట‌.

 

త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి డిలేటెడ్ సీన్ ను విడుదల చేశారు. నాగ చైతన్య, సుబ్బరాజ్ ల మధ్య ఈ సన్నివేశం సాగుతోంది. సినిమాలో నాగ చైతన్య కన్పిస్తే చాలు గొడవ పడే సుబ్బరాజ్ ఈ వీడియోలో మారిపోయినట్టుగా కన్పిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts