telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మజిలీ చిత్రం .. వసూళ్లు ..

Majili

శివ నిర్వాణ డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా, షైన్ స్క్రీన్ బ్యానర్ లో వచ్చిన సినిమా మజిలీ. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న శుక్రవారం రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. మొదటి షో నుండి పాజిటివ్ ట్క్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా మొదటి రోజు 5 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయగా రెండవ రోజు ఆ దూకుడు చూపించింది. మొదటి రెండు రోజులు కలిపి మజిలీ మొత్తంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో 9.51 కోట్లను కలెక్ట్ చేసింది. 15 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. 21.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన మజిలీ వీకెండ్ లోనే 14 కోట్ల దాకా వసూళ్లు తెచ్చుకునేలా ఉంది.

సినిమాకు ఎలాగు హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ 12న చిత్రలహరి వచ్చే వరకు మజిలీకి తిరుగులేదని చెప్పొచ్చు. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా నటించిన ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు సిని ప్రేక్షకులను అలరిస్తుంది. ఏరియాల వారిగా మజిలీ రెండు రోజుల కలక్షన్స్ వివారాలు చూస్తే..

నైజాం : 3.67 కోట్లు
సీడెడ్ : 1.37 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.39 కోట్లు
ఈస్ట్ : 0.61 కోట్లు
వెస్ట్ : 049 కోట్లు
కృష్ణా : 0.72 కోట్లు
గుంటూరు : 0.98 కోట్లు
నెల్లూరు : 0.28 కోట్లు
ఏపి/తెలంగాణ : 9.51 కోట్లు

Related posts