telugu navyamedia
సినిమా వార్తలు

50 కోట్ల క్లబ్ లో “మజిలీ”

Majili

శివ నిర్వాణ డైరక్షన్ లో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా, షైన్ స్క్రీన్ బ్యానర్ లో వచ్చిన సినిమా మజిలీ. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న శుక్రవారం రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా తొలివారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45.6 కోట్ల గ్రాస్, 27.85 కోట్ల షేర్ ను సాధించింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈమేరకు పోస్టర్ తో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేసింది చిత్రబృందం.

చైతూ కెరియర్లోనే తొలివారంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ తో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఇటు యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో ఇప్పటికి థియేటర్లలో తన జోరును కొనసాగిస్తోంది. ఇక నాగ చైతన్య నటనలో పరిణతి కన్పించిందని అంటున్నారు సినీ విమర్శకులు. సమంత నటన, పాటలు, నేపథ్య సంగీతం, దివ్యాన్ష కౌశిక్ గ్లామర్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అక్కినేని ఫ్యామిలీకి, అభిమానులకు తీపిగుర్తుగా మిగిలిన ఈ చిత్రం త్వరలోనే 50 కోట్ల గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.

Related posts