telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అటవీశాఖ అధికారులకు రక్షణ కలిపిస్తాం : మహమూద్ అలీ

Mahmood Ali Shortly caught chain snachers

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మడలంలో మహిళ ఎఫ్ఫార్వో పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కృష నిన్న దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. అటవీభూముల్లో అక్రమసాగును అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ అధికారిణిపై ఎమ్మెల్యే కుటుంబీకులు దాడిచేసిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

అటవీ అధికారులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అన్యాక్రాంతమైన అటవీభూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినా, హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లినా పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, మహిళా ఎఫ్ఆర్ఓపై దాడి ఘటనలో కాగజ్ నగర్ డీఎస్పీ, రూరల్ సీఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ దాడికి కారకుడైన ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణతో పాటు 16 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Related posts