telugu navyamedia
telugu cinema news trending

బిగ్ బాస్-3 : అలీ, మహేష్ ఫైట్… తిండి విషయంలో ఫైర్ అయిన హిమజ

Bigg-Boss-3

బిగ్ బాస్-3 తెలుగు రియాలిటీ షో నుంచి గ‌త వారం రోహిణి ఎలిమినేట్ కాగా… ప్రస్తుతం ఐదో వారం షో కొనసాగుతోంది. ఇప్పుడు హౌజ్ లో 12 మంది స‌భ్యులు ఉన్నారు. సోమవారం నామినేష‌న్ ప్ర‌క్రియ పూర్తయ్యింది. ఈసారి ఎలిమినేష‌న్‌లో బాబా భాస్క‌ర్, పునర్నవి, మహేష్, హిమజ, అషు, మహేష్, రాహుల్‌ ఏడుగురు స‌భ్యులు ఉన్నారు. ఎపిసోడ్ 32లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి టాలెంట్ షో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ షోకి బాబా భాస్క‌ర్‌, శ్రీముఖి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రించారు. మిగ‌తా ఇంటి స‌భ్యులు త‌మ టాలెంట్ ప్ర‌ద‌ర్శించారు. అయితే రెండో రౌండ్‌కి మాత్రం న‌లుగురు ఎంపిక‌య్యారు. అందులో న‌లుగురు మేల్ కంటెస్టెంట్స్ ఉండ‌డం విశేషం. ఒక్క మ‌హిళ‌ని అయిన ఎంపిక చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికి అధి సాధ్యం కాలేద‌ని శ్రీముఖి చెప్పుకురాగా, రెండో రౌండ్‌లో అలీ రెజా, మహేష్ విట్ట, రవికృష్ణ, వరుణ్ సందేశ్‌లు నిలిచారు.

రెండో రెండ్ ప్రారంభానికి ముందు జ‌డ్జిలు అయిన బాబా భాస్క‌ర్, శ్రీముఖి త‌మ డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఇంటి స‌భ్యుల‌ని అల‌రించాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో వారిద్ద‌రు మ‌గధీర సినిమాలోని పంచ‌దార బొమ్మ పాట‌కి అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఆ త‌ర్వాత అలీ రాజా ప్ర‌ద‌ర్శించిన న‌ట‌ప‌టిమ ప్ర‌తి ఒక్క‌రిని కంట‌త‌డి పెట్టించింది. ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్ లో చ‌నిపోవడం, ఆమె జ్ఞాప‌కాల‌ని త‌లచుకుంటూ జీవిస్తుండ‌డం ఎంత హృద‌య విదార‌కంగా ఉంటుందో అలీ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌లో చూపించారు. అలీ న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రి క‌ళ్ళల్లో క‌న్నీరు తెప్పించింది.

ఇక త‌రువాత వ‌చ్చిన మ‌హేష్ డ‌బ్బు వ‌ల‌న మ‌నుషుల మ‌ధ్య రిలేష‌న్స్ ఎలా ఉంటున్నాయి. డ‌బ్బు కోసం ఎవ‌రు ఏం చేస్తున్నారు. మ‌నిషి సృష్టించిన డ‌బ్బు మ‌నిషినే ఆట‌బొమ్మ‌గా ఎలా మారుస్తుంద‌నేదాని గురించి వివ‌రించాడు. మూడో ప‌ర్‌ఫార్మ‌ర్ అయిన ర‌వి ప్రేమ పిచ్చోడుగా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చాడు. ప్రేయ‌సి కోసం పిచ్చోడైతే ఎలా ఉంటుందో ఒరిజిన‌ల్‌గా చేసి చూపించాడు. ఆయ‌న ప‌ర్‌ఫార్మెన్స్ చేసే స‌మ‌యంలో ‘జన్మనీదేలే’ అనే పాటను రాహుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుగా అందించాడు. చివ‌రి కంటెస్టెంట్ వ‌రుణ్‌ సందేశ్.. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే’ పాటను ఆల‌పిస్తూ స్టెప్పులు వేసి అల‌రించాడు

న‌లుగురి ప‌ర్‌ఫార్మెన్స్ పూర్తైన త‌ర్వాత జ‌డ్జెస్ అలీ రాజా, ర‌విల‌ని బెస్ట్ ప‌ర్‌ఫార్మర్‌గా ఎంపిక చేశారు. వీరిద్ద‌రిలో ఎవ‌రు మోస్ట్ బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్ అనేది ఇంటి స‌భ్యులే నిర్ణ‌యిస్తార‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో.. అలీకి ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి. దీంతో ఆయ‌న‌ని బిగ్ బాస్.. విజేత‌గా ప్ర‌క‌టిస్తూ అప్పీ ఫిజ్ జాకెట్‌ను బహూకరించారు. దీనిని ఈ వారం మొత్తం ధ‌రించాల‌ని చెప్పాడు. అలీకి ఈ వారం ఎవ‌రు పని చెప్పొద్ద‌ని కూడా బిగ్ బాస్ ఆదేశించారు. ఆ త‌ర్వాత బిగ్ బాస్ కోర్టు యార్డులో ఉంచిన కంప్లైంట్ బాక్స్ లో త‌మ ఫిర్యాదుల‌ని రాసి అందులో వేయాల‌ని ఇంటి స‌భ్యుల‌కి సూచించారు. వీటిని కెప్టెన్ చ‌దివి వాటికొక ప‌రిష్కారం చూపాలి అని కోరారు.

బిగ్ బాస్ ఆదేశానుసారం కెప్టెన్ శివజ్యోతి ఇంటి సభ్యుల ముందు ఒక్కొక్క‌రి కంప్లైంట్స్‌ చదివి వినిపించింది. ముందుగా మ‌హేష్ విట్టాపై వ‌చ్చిన ఫిర్యాదుని శివ‌జ్యోతి చ‌దివి వినిపించింది. అవ‌స‌రంలేని విష‌యాల‌లో దూరి అన‌వ‌స‌రపు స‌ల‌హాలు ఇస్తాడని అందులో రాసి ఉంది. ఇది ఎవ‌రు రాసి ఉంటారో గెస్ చేయ‌మ‌ని శివ‌జ్యోతి.. మ‌హేష్‌ని అడ‌గ‌గా అది ఎవ‌రు రాశారో వాళ్ళ‌నే చెప్ప‌మ‌ను అని అన్నాడు. ఎవ‌రు చెప్ప‌క‌పోవ‌డంతో రాసినోళ్ళు చెప్ప‌న‌ప్పుడు దానికి వాల్యూ ఇచ్చి నేను మాట్లాడటం ఎందుకు అని మహేష్ అన్నాడు. ఆ త‌ర్వాత కంప్లైంట్ కూడా మ‌హేష్‌దే కావ‌డంతో అది రాసింది నేనే అంటూ పున‌ర్న‌వి మ‌హేష్ త‌ప్పుల‌ని ఎత్తి చూపించింది. నువ్వు బాబా భాస్క‌ర్‌తో త‌ప్ప ఎవ‌రితో క‌ల‌వ‌వు. అన‌వ‌స‌రంగా వేరే విష‌యాల‌లో దూరి స‌ల‌హాలు ఇస్తావు. ఇది ఇంకోసారి చేయకు అని హెచ్చ‌రించింది పున‌ర్న‌వి.

తరువాత కంప్లైంట్ అలీపై రాగా, దానిని శివజ్యోతి చదివి వినిపించింది. ‘‘హౌస్‌మేట్స్‌ని తక్కువ చేసి మాట్లాడటం.. ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వకపోవడం.. హీరో అవ్వడానికి బిగ్ బాస్ నియమాలు తప్పడం’’ అని శివజ్యోతి వెల్లడించింది. ఇది మ‌హేష్ రాసిన‌ట్టు ఒప్పుకోగా, దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు అలీ. నేను ఎవ‌రిని త‌క్కువ చేయలేదు. నీ ఒక్క‌డికే అలా అనిపించి ఉండొచ్చు. నేను హీరోలానే ఉంటాను అది నా మేన‌రిజం అని అన్నాడు. ఆ త‌రువాత మ‌హేష్ కూడా అలీ తప్పుల‌ని ఎత్తి చూపుతూ మాట్లాడుతుండ‌గా, అలీ ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇదేమ‌న్నా నీ ఇల్లు అనుకుంటున్నావా..ఎందుకు అలా అరుస్తున్నావ్ అని మ‌హేష్ కూడా మిస్ ఫైర్ అయ్యాడు. వీరిద్ద‌రిని శివ‌జ్యోతి కూల్ చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి ఇద్ద‌రి మ‌ధ్య వాదోప‌వాదాలు ఓ రేంజ్‌లో జ‌రిగాయి.

ఇక శ్రీముఖికి సంబంధించిన కంప్లైంట్‌ని రాహుల్ రాయ‌గా, దానిని శివ‌జ్యోతి చదివి వినిపించింది. దీనిని స్పోర్టివ్‌గా తీసుకున్న శ్రీముఖి రాహుల్‌కి హ‌గ్ ఇచ్చింది. కాని అంత‌లోనే రాహుల్ లేచి మ‌ళ్ళీ పాత స్టోరీనే వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌గా, దీనిపై మండిప‌డింది శ్రీముఖి. అన్నీ మ‌రిచిపోయి మంచిగా ఉందామ‌ని ప్ర‌య‌త్నిస్తున్నాను కాని , అత‌నే ఇంకా ఈ విష‌యాన్ని పెద్ద‌ది చేస్తున్నాడ‌ని వాపోయింది శ్రీముఖి. అయితే ఎక్కువ కంప్లైంట్స్ మ‌హేష్‌, రాహుల్‌పై రావ‌డంతో వారిద్ద‌రిని జైలులో వేసి తాళం వేయాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో 33వ ఎపిసోడ్ ముగిసింది.

నేటి ఎపిసోడ్‌లోను మ‌రో రచ్చ మ‌నం చూడ‌బోతున్నాం. హిమ‌జ ఆమ్లెట్ తింటున్న స‌మ‌యంలో ఎవ‌రో ఏదో అన‌డంతో తాను తినే ప్లేట్ నేల‌పై ప‌డేయ‌డంతో పాటు ఎగ్స్ మొత్తం ప‌డేసిన‌ట్టు ప్రోమోలో క‌నిపిస్తుంది. నేను తిన‌న‌ప్పుడు ఎవ‌రు కూడా తిన‌కూడ‌దు అని సీరియ‌స్‌గా హిమ‌జ అర‌వ‌డంతో మిగ‌తా ఇంటి స‌భ్యులు షాక్‌తో అలా చూస్తుండిపోవ‌డం ప్రోమోలో చూపించారు.

Related posts

ప్రాణం మీదకు తెచ్చిన .. తుపాకీతో-సెల్ఫీ మోజు..

vimala p

అమరనాథుడి .. దర్శనం.. పులకించిన భక్తజనం..

vimala p

వసూళ్లతో హుషారుగా ఉన్న .. ఇస్మార్ట్‌ శంకర్‌.. 3రోజుల్లో 36కోట్లు..

vimala p