telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంతగా ఆకర్షించని మహర్షి ఆడియో .. వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టిందా..!

mahesh two music directors silent war

టాలీవుడ్ లో ప్రస్తుతం సంగీత దర్శకుల కొరత ఉన్న మాట వాస్తవం. నెంబర్ పరంగా చెప్పుకోవడానికి చాలానే ఉన్నారు కాని పక్కాగా మంచి ఆల్బమ్స్ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం లేరు. ఒకటి హిట్ అయితే వరసగా రెండు, మూడు ఫ్లాప్ ఆడియోను ఇస్తున్నారు. ఇది అందరి విషయంలో జరుగుతున్నదే. అయితే టాప్ పొజిషన్ కోసం మాత్రం ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉంది. ఒకరు దేవిశ్రీ ప్రసాద్ రెండు థమన్. ఉదాహరణకు మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే, దేవీశ్రీ ప్రసాద్… పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సినిమాలతో సూపర్ హిట్ ఆల్బం ను మహేష్ కు ఇచ్చాడు. అలాగే థమన్ దూకుడు, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ ని ఇచ్చాడు.

ఇటీవల రిలీజైన మహర్షి సినిమాతో ఫ్యాన్స్ ను శాటిసిఫై చేయలేకపోయాడు దేవీ. దీంతో ఫ్యాన్స్ ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ కి ఛాన్స్ ఇమ్మని చెబుతున్నారట. దీనితో త్వరలో మొదలవబోతున్న మహేష్-అనిల్ రావిపూడి సినిమాకు దేవీ నే అనుకున్నారట. కానీ ఈ సారి థమన్ కి ఇస్తే బావుంతుందని మహేష్ ఫ్యాన్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక్క ఫ్లాప్ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య వార్ క్రియోట్ చేసింది.

Related posts