mahesh-babu-and-mani-rathnam

“మాస్ట‌ర్ ఈజ్ బ్యాక్‌” అంటున్న మహేష్… “నవాబ్”పై ప్రశంసల జల్లు

మణిరత్నం లాంటి దర్శకుడితో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో కలలు కంటుంటాడు. అలాంటి గొప్ప దర్శకుడు కాబట్టే సూపర్ స్టార్ మహేష్ బాబు మణిరత్నంకు వీరాభిమాని. కానీ చాలా రోజులుగా త‌న స్థాయికి త‌గ్గ చిత్రాన్ని అందించ‌డంలో విఫలమవుతున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘చెక్క చివంత వానమ్’ అనే సినిమా తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమా చూసిన ఆయన అభిమానులంతా మణిరత్నం ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు “నవాబ్”పై ప్రశంసల వర్షం కురిపించారు. 

”ఇదొక క్లాసిక్ సినిమా. ఈ దశాబ్దానికి ఇదే గొప్ప సినిమా. ప్రతి ఒక్కరూ అధ్బుతంగా అద్భుతంగా నటించారు. రెహ్మాన్ సంగీతం అద్భుతంగా ఉంది. ఓ మణిరత్నం అభిమానిగా చెప్తున్నాను… చెన్నైలోని థియేటర్లలో ఆయన సినిమాలను చప్పట్లు కొట్టుకుంటూ చూసేవాడిని. ఇప్పుడూ అదే చేశాను. నా హోం థియేటర్‌లో కాలర్ ఎగరేసి మరీ ఈ సినిమాను చూశాను… ఇప్ప‌టివ‌ర‌కు మీరు ఈ సినిమా చూడ‌క‌పోయిన‌ట్టైతే వెంట‌నే వెళ్లి టిక్కెట్స్ తీసుకోండి. ఓ క్లాసిక్ సినిమాకు మ‌నంద‌రం సాక్ష్యాలుగా నిలుస్తాం. ఈ ద‌శాబ్ద‌పు ఉత్త‌మ చిత్రం ఇదే… “మాస్ట‌ర్ ఈజ్ బ్యాక్‌” ” అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *