telugu navyamedia
telugu cinema news trending

అందుకే పూరీని .. గుర్తుచేసుకోలేకపోయా.. : మహేష్ బాబు

Maharshi1

‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రసంగిస్తున్న వేళ, తనతో సినిమాలు తీసిన అందరు దర్శకులనూ ప్రస్తావించిన టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరును మరచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, అందుకు వివరణ ఇచ్చారు. “నేను ఈవెంట్‌ కు వచ్చే ముందు సుమారు 16 గంటల సేపు జర్నీ చేశాను. యూరప్‌ నుంచి హైదరాబాద్ కు వచ్చాను. స్టేజ్‌ మీద నేను మాట్లాడుతుండగా, కొంతమంది అభిమానులు వచ్చారు.

ఆ హడావిడిలో పూరీ జగన్నాథ్ పేరును మరచి పోయాను. అది నా తప్పే. పూరి జగన్నాథ్‌ కు చాలా థ్యాంక్స్‌. ‘పోకిరి’ నన్ను సూపర్‌ స్టార్‌ ని చేసిన సినిమా” అని మహేశ్ అన్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాకు, ‘మహర్షి’కి సంబంధం లేదని, టీజర్ చూసిన కొందరు అలా భావించివుండవచ్చని మహేశ్ అభిప్రాయపడ్డారు. ‘మురారి’ సినిమాను హైదరాబాద్ లో తన తండ్రి కృష్ణతో కలిసి చూశానని, సినిమా ముగిసిన తరువాత ఆయన తన భుజంపై చెయ్యి వేశారని, అది తన జీవితంలో మోస్ట్ మెమొరబుల్ మూమెంటని అన్నారు.

Related posts

అల్లు అర్జున్ క్యారవాన్ లుక్ చూశారా…!!?

vimala p

మోడీ బయోపిక్.. : వెబ్ సిరీస్ పై కూడా.. ఈసీ ఆంక్షలు.. !

vimala p

హైదరాబాద్ లో .. మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్.. !

vimala p