telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు.. ఇంట్రో టీజర్‌, ఫస్ట్‌లుక్‌ … మహేష్‌బాబు బర్త్‌డే కి …

mahesh movie first look on his birthday

దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న ఈ సినిమా నుండి ఇంట్రో టీజర్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారూ.. సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు…’ అంటూ సాగే ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సోల్జర్‌ గెటప్‌లో ఎంతో స్టైలిష్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు దేవిశ్రీప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉండటం విశేషం.

మహేష్ ఫ్యాన్స్ ఇంట్రో టీజర్‌, ఫస్ట్‌లుక్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ విడుదల చేయడంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కాశ్మీర్‌ షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్‌ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర బృందం. సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ.. టెక్నీషియన్స్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రం, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, గీత గోవిందం తో గీతా ఆర్ట్స్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ క్యూ లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మహేష్ ఏ సినిమాలో నటించబోతున్నారన్న క్లారిటి మాత్రం లేదు.

Related posts