telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బుల్లితెరపై దుమ్ము తెలుపుతున్న మహేష్ మూవీ…

Sarileru NIkevvaru

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ టించారు. ఈ సినిమా అనీల్ కెరియర్లోనే బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో అనీల్ రావిపూడి కెరీర్ లో మరో మెట్టు ఎక్కాడు.ఇక రష్మిక అందంతో పాటు అల్లరితోనూ ఆకట్టుకుంది. ఇక మహేష్ బాబులో చాలా రోజులతర్వాత మాస్ యాంగిల్ చూసారు అభిమానులు. ఇక దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఇప్పటి వరకు మూడు సార్లు టీవీలో టెలికాస్ట్ అయ్యింది ఈ సినిమా.  మూడు సార్లు కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుంది.ఇపటివరకు ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఒక్కసారి లేదా రెండు సార్లు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది. కానీ మహేష్ మూవీ మాత్రం మూడుసార్లు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. గత వారం టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా ఏకంగా 12.55 రేటింగ్ సాధించింది.ఇలా మహేష్ సరిలేరు సినిమా బుల్లితెర పైన రికార్డులు నెలకొల్పుతుంది.

Related posts