telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ తిరస్కరించిన ఆ స్టోరీతోనే ప్రభాస్ కు భారీ హిట్…!!

Mahesh

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ప్రస్తుతం ప్రభాస్ కు భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రాలలో వర్షం ఒకటి. 2004 సంక్రాంతికి విడుదలైన ‘వర్షం’ మూవీ చిరంజీవి అంజి, బాలయ్య లక్ష్మీ నరసింహ వంటి చిత్రాలకు పోటీ ఇస్తూ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దర్శకుడు శోభన్ ఈ చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. కాగా ఈ మూవీ మొదట మహేష్ దగ్గరికి వెళ్లిందట. దర్శకుడు వర్షం కథను మొదట మహేష్ కి వినిపించాడట. అయితే మహేష్ ఆ మూవీ పట్ల ఆసక్తి చూపలేదట. 2002లో దర్శకుడు శోభన్ తో మహేష్ బాబీ మూవీ చేశారు. బాబీ మూవీ ప్లాప్ గా నిలిచింది. దీనితో మరలా దర్శకుడు శోభన్ తో మహేష్ మూవీ చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఆ ఆఫర్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది. అలా మహేష్ ‘వర్షం’ రూపంలో ఓ భారీ హిట్ మూవీని చేజార్చుకున్నారు. అదే ఏడాది మహేష్ బాబు దర్శకుడు ఎస్ జే సూర్యతో ‘నాని’ అనే ప్రయోగాత్మక చిత్రం చేసి ప్లాప్ అందుకున్నారు.

Related posts