telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సినిమా వార్తలు

మింత్రతో .. మహేష్ బాబు దుస్తుల బ్రాండ్ …

mahesh humble brand in mintra

నటుడు మహేష్ బాబుకు చెందిన దుస్తుల బ్రాండ్ హంబుల్ ఆన్ లైన్ సంస్థ మింత్రతో జత కట్టింది. ఆన్‌లైన్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు దీంతో కలిసింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం మేరకు ఇక నుంచి మింత్రలో హంబుల్ దుస్తులు లభిస్తాయి. హంబుల్ కోను మహేష్ బాబు గత ఏడాది లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మింత్రా ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ. ఇక, ది హంబుల్ కో మహేష్ బాబుకు చెందిన మెన్స్‌వేర్ బ్రాండ్. ఒప్పందం మేరకు హంబుల్ బ్రాండ్ కింద ఉన్న స్వెట్ షర్ట్స్, హుడీస్ షర్ట్స్, టీ షర్ట్స్, బాటమ్ వేర్ దుస్తులు మింత్రాలో అందుబాటులో ఉంటాయి. రూ.599 నుంచి ధర ప్రారంభమవుతుంది. దాదాపు 200 రకాల దస్తులు అందిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా తమ బ్రాండ్ (హంబుల్) ఉత్పత్తులు దేశవ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తెలిపారు. తాము ఆరు నెలల క్రితం హంబుల్ కో బ్రాండ్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.

మింత్రా జబాంగ్ హెడ్ నాగారం మాట్లాడతూ ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్స్‌ను తమ సంస్థ కొనుగోలుదారులకు అందిస్తోందని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లకు అందించేందుకు హంబుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మింత్రాలో దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు లభిస్తాయి.

Related posts