telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీనేజ్ హీరోయిన్ తో సన్నిహితంగా మహేష్ భట్… లీకైన వీడియో

Mahesh-Bhatt

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ ఆత్మహత్య కేసును ఇప్పుడు సీబీఐ ఎంక్వయిరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రేక్షక లోకాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. మరోవైపు సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం, ఫేవరేటిజం ఉన్నాయని, ఆ కారణంగా ఎంతోమంది భవిష్యత్ ఉన్న నటుల జీవితాలు ఇలా అంతమొందుతున్నాయనే చర్చ తీవ్రమైంది. సుశాంత్ మరణం వెనుక రియాతో కలిసి మహేష్ భట్ కుట్రలు చేశారనే ఆరోపణలు ఎక్కువగా వస్తుండటంతో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్‌తో మహేష్ భట్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ వీడియో లీక్ కావడం జనాల్లో మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్‌తో మహేష్ భట్ ప్రైవేట్ రూమ్‌లో ఉన్న వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో 2004 సంవత్సరంలో తీసింది కాగా… అప్పుడు హీరోయిన్ జియాఖాన్ 16 ఏళ్ళ టీనేజ్ అమ్మాయి అని తెలుస్తోంది. ఆ సమయంలో మహేష్ భట్ సోదరుడి నిర్మాణంలో రూపొందుతున్న ఓ సినిమాలో జియాఖాన్ చేయాల్సి ఉందని చెప్పుకుంటున్నారు. కానీ చివరకు జియాఖాన్ ఆ సినిమా చేయకుండా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘నిశ్శబ్ద్’ సినిమాతో 2007లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె నటించింది. ఆ తర్వాత 2013లో అనుమానాస్పద రీతిలో జియాఖాన్ మరణించిందన్న విషయం తెలిసిందే.

Related posts