telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కార్ వారి పాట” సినిమా కథ ఇదే…?

SVP

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “సర్కార్ వారి పాట”. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో మహేష్ మొహం కనిపించకుండా డిజైన్ చేయగా… చెవికి పోగు, మెడపై రూపాయి టాటూతో అదరగొట్టాడు మహేష్. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత మహేష్ సినిమా పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం బ్యాంకింగ్ సెక్టార్ లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుపై మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మహేష్ బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా కనిపించనున్నాడని, ఆర్థిక సమస్యల కారణంగా తన కుంటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలా అధిగమించాడనే నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా సినిమా ఉంటుందని తాజాగా గాసిప్ వినిపిస్తోంది.

Related posts