telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎన్టీఆర్ : కథానాయకుడు”పై మహేష్ ట్వీట్

Surgical strike mahesh selute poilets

దివంగత నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ బయోపిక్”ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. నిన్న సినిమా చూసిన నందమూరి అభిమానులు సినిమా బాగుందంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. నిన్న “ఎన్టీఆర్ : కథానాయకుడు” చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు వీక్షించారు. అంతేకాదు పలువురు సినిమా ప్రముఖులు సినిమా చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా “ఎన్టీఆర్ : కథానాయకుడు”పై మహేష్ బాబు ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఎన్టీఆర్ “కథానాయకుడు” సినిమా అత్యద్బుతమని, క్రిష్ ఊహాతీతమైన చిత్రాన్ని తీశారని, ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారని మహేష్ బాబు అన్నారు. తెలుగు సినిమా దిగ్గజం ఎన్టీఆర్ గారికి ఈ చిత్రం అద్భుతమైన నివాళి అని, ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారని, ఈ సినిమా కంటే మరో గొప్ప సినిమా అంటే “మహానాయకుడు” అని, “మహానాయకుడు” కోసం ఆసక్తిగా ఎదుచూస్తున్నాను అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మహేష్ ట్వీట్ పై “ఎన్టీఆర్ బయోపిక్” దర్శకుడు క్రిష్ స్పందించారు. ”థాంక్స్ మహేష్ గారు… మీ అభినందనలు రావడం నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అంటూ రిప్లై ఇచ్చారు క్రిష్.

Related posts