telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూపర్ స్టార్ డ్యూయల్ రోల్ ?

SVP

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారట డైరెక్టర్. ఇందులో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా చేయనున్నాడు. ఆర్థిక నేరాలకు వందల కోట్లు ఎగ్గొట్టిన ఓ బడా వ్యాపారవేత్త దగ్గర నుండి ఆ కోట్ల డబ్బును ఎలా తిరిగి రాబట్టాడనే ప్రయత్నాలను మనకు చూపించేందుకు పరశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరోవార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. మహేష్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. భిన్న అభిప్రాయాలు కలిగిన కవలలుగా మహేష్ నటించనున్నారని టాక్. కథ ప్రకారం ఒక క్యారెక్టర్ క్లాస్ గా మరో క్యారెక్టర్ పక్క మాస్ గా ఉండనుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.

Related posts