telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంటువ్యాధిలా మారింది… కేటీఆర్ ట్వీట్ పై మహేష్

Mahesh-with-KTR

ఇటీవల తెలంగాణాలో వైరల్ ఫీవర్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఆసుపత్రులన్నీ జ్వర బాధితులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బహిరంగప్రదేశాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని రకాలచర్యలు తీసుకుంటున్నారని, ప్రతిఒక్కరూ వారి సొంత ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించాలంటే ప్రతి ఇంట్లో పరిశుభ్రత అత్యంత కీలకమన్నారు. నేను మా ఇంటి నుండే ఈ ప‌ని మొద‌లు పెడుతున్నాను. మీరు కూడా చేసి ఆ ఫోటోల‌ని పోస్ట్ చేయండ‌ని కేటీఆర్ కోరారు. ఈ ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన మహేష్ బాబు డెంగ్యూ మ‌రియు వైరల్ ఫీవ‌ర్స్‌ నగరంలో అంటువ్యాధిగా మారింది. మీ ప్రాంగణం మరియు చుట్టు ప‌క్క‌ల నీటి నిల్వ లేకుండా ఉంచడానికి అద‌న‌పు జాగ్ర‌త్త‌లు తీసుకోండి. అప్రమత్తంగా ఉండండి అని మ‌హేష్ కోరారు.

Related posts