telugu navyamedia
సినిమా వార్తలు

పిక్ లీక్… ఆర్మీ ఆఫీసర్ గా మహేష్

Mahesh-Babu

“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో ప్రారంభమయ్యింది. ఈ సినిమాలో మ‌హేశ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ లుక్ ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆయన అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే తాజాగా మహేష్ బాబు లుక్ సోష‌ల్ మీడియాలో లీకైంది. ఆర్మీ బ‌ట్ట‌ల్లో మ‌హేశ్, రాజేంద్ర ప్ర‌సాద్ ఉన్న ఫోటో ఒక‌టి ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కాశ్మీర్ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కోసం ఓ స్పెష‌ల్ ట్రైన్ సెట్‌ను అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో రెడీ చేస్తున్నార‌ట‌. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Related posts