telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాముడిగా మహేష్ బాబు… ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ వైరల్

Mahesh

తాజాగా సూపర్ స్టార్ మ‌హేష్ బాబుని రాముడి లుక్‌లోకి మార్చి ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ రూపొందించారు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మ‌హేష్ బాబు హీరోగా రాజమౌళి `రామాయణం` సినిమా చేయ‌నున్నాడ‌ని, అందులో రాముడి గెటప్‌లో మహేష్ ఇలా ఉంటాడ‌ని ఊహిస్తూ ఒక అభిమాని పోస్టర్‌ను రూపొందించాడు. ఆ పోస్టర్‌లో రాముడిగా మహేష్ గెట‌ప్ అదిరిపోయింది. ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇది అభిమానులనే కాక ఇత‌ర సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మ‌హేష్ బాబు త్వ‌ర‌లో ప‌ర‌శురాంతో ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. కొద్ది రోజుల క్రితం రాజ‌మౌళి ..మ‌హేష్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌గా, దీనికి సంబంధిచి క‌థ‌, పాత్ర‌లు, యాక్ట‌ర్స్ ఇలా త‌దిత‌ర అంశాల‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌స్తున్నాయి.

Related posts