telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ సినీ ప్రయాణానికి 41 ఏళ్ళు..

Mahesh

అమ్మాయిలకు కలల రాకుమారుడు. ఎప్పటికీ యవ్వనంగానే ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవల సితారతో షాపింగ్ వచ్చిన మహేష్‌ను చూసి అందరూ అది గౌతమ్ అనుకున్నారు. అయితే మహేష్ సినీ పరిశ్రమకు వచ్చి ఇప్పటికి 41 సంవత్సరాలు ముగిసాయి. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాను పోస్టులపై పోస్టులు పెట్టి తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. ప్రస్తుతం మహేష్ 41 సంవత్సారాల ప్రస్థానంపై రూపొందించిన సీడీపీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ సీడీపీలో ఓ పెద్ద భవనం దాని పక్కనే మహేష్ మైనపు బొమ్మ చూస్తే ఇట్టే ఆకట్టుకునేలా తయారు చేశారు. అయితే మహేష్ తన సినీ జీవితాన్ని 1979లో దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో నీడ సినిమాతో మొదలు చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా విడుదలయ్యి ఈ ఏడాదదికి 41 సంవత్సారాలు కానున్నాయి. ఇప్పటి వరకు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌ల తరువాత మెగాస్టార చిరంజీవి, బాలకృష్టా మాత్రమ పరిశ్రమలోకి వచ్చి 40 సంవత్సారాలను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మహేష్ చేరాడు. మహేష్ నీడ సినిమా తరువాత తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబుతో కలిసి పోరాటం, శంఖారావం, కొడుకు దిద్దిన కాపురం, గూఢాచారి 117, బజారు రౌడీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించాడు. అప్పట్లోనే మహేష్ రెండు పాత్రలను చేసి అందరిని ఆకట్టుకున్నాడు.

Related posts