telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్-రాజమౌళి సినిమా కొత్త అప్డేట్…

Rajamouli-with-MB

మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై ఇప్పటికే చాలా రూమర్లు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ గురించి ఆ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారని, గత రెండు సంవత్సరాలుగా ఆయన ఎదురు చూస్తున్నారని, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రీకరణ పూర్తి చేశాకనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికా నేపథ్యం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని గత కొంతకాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై నిర్మాత కేఎల్ నారాయణ స్పందిస్తూ “నాకు ఇంకా కథ గురించి తెలీదు. వేరే ఎవరో సినిమా కథ గురించి వార్తలను ఎలా వ్యాప్తి చేస్తారు ? ఆ ఊహాగానాలతో నిజం లేదు” అని ఆయన వెల్లడించారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది.

Related posts