telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ తదుపరి చిత్రానికి ముహూర్తం ఖరారు

Mahesh-Babu

ఇటీవల మహేశ్‌బాబు “మహర్షి” విడుదలై వేసవిలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు మహేశ్‌ తదుపరి చిత్రానికి ముహూర్తం ఖరారైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఆయన కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. హీరోగా ఆయనకు 26వ చిత్రమిది. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందీ చిత్రం. స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని, త్వరలో క్లాప్‌ కొడతామని అనిల్‌ రావిపూడి ఆదివారం ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం మహేశ్‌ విదేశాల్లో ఉన్నారు. సినిమా పూజా కార్యక్రమాలకు ఆయనెప్పుడూ హాజరుకారు. దీన్ని సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ సినిమా ముహూర్తానికి కూడా రారని సమాచారం. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ముహూర్తం రోజున అధికారికంగా ప్రకటించనున్నారు.

Related posts