telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” రెండు రోజుల కలెక్షన్స్

Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” సినిమా గురువారం విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలిరోజు ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అయితే శుక్రవారం సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ సమ్మర్ సెలవులు కావడం, థియేటర్ లో పెద్దగా సినిమాలు లేకపోవడం సినిమాకు కలిసొచ్చింది. ఫలితంగా శుక్రవారం కూడా అన్ని ఏరియాల్లో టికెట్లు హౌస్ ఫుల్ కావడం విశేషం. టికెట్ రెట్లు పెంచినా జనాలు మాత్రం తగ్గడం లేదు. నైజాంలో మొదటిరోజు ఆరు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా మూడు కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు రూ.32.57 కోట్ల షేర్ ని రాబట్టింది.

ఏరియాల వారీగా “మహర్షి” రెండు రోజుల కలెక్షన్స్
నైజాం – రూ.9.67 కోట్లు
సీడెడ్ – రూ.4.01 కోట్లు
వైజాగ్ – రూ. 3.93 కోట్లు
ఈస్ట్ – రూ. 3.8 కోట్లు
వెస్ట్ – రూ. 2.90 కోట్లు
కృష్ణ – రూ. 2.13 కోట్లు
గుంటూరు – రూ. 4.89 కోట్లు
నెల్లూరు – రూ. 1.24 కోట్లు

Related posts